ప్రైవసీ పాలసీ
చివరిసారి అప్‌డేట్: ఆగస్టు 23, 2026
సూక్ష్మం (Sukshmam.com) ఒక న్యూస్, అనాలిసిస్ సైట్. ఈ పేజీలో మేము ఏం తీసుకుంటాం, దాన్ని ఎందుకు వాడుతాం అనేది సింపుల్‌గా రాశాం.
మేము ఏం సేకరించం
రీడర్లకు అకౌంట్ లేదా లాగిన్ లేదు. మీ పేరు, ఫోన్, చిరునామా లాంటివి మాకు తెలియవు — మీరే మాకు మెయిల్ చేస్తే తప్ప. ప్రస్తుతం గూగుల్ యాడ్స్ లేదా ఇతర ప్రకటనల నెట్‌వర్క్‌లు వాడటం లేదు. మీ డేటాను అమ్మం, ప్రకటనల కోసం షేర్ చేయం.
అనలిటిక్స్ (PostHog)
సైట్ ఏ పేజీలు బాగా చదువుతున్నారో, ఎక్కడ నుంచి వస్తున్నారో అర్థం చేసుకోవడానికి మేము PostHog వాడుతున్నాం. ఇది మా వద్ద ఉన్న ఏకైక అనలిటిక్స్ టూల్.
PostHog సాధారణంగా ఇలాంటివి చూస్తుంది: ఏ పేజీ తెరిచారు, ఎంతసేపు ఉన్నారు, ఏ బ్రౌజర్ లేదా ఫోన్ నుంచి వచ్చారు, ముందు ఏ సైట్ నుంచి వచ్చారు, షేర్ బటన్ నొక్కారా. మీకు ఒక రాండమ్ ID ఇస్తుంది — అది మీ పేరుతో కలిపి ఉండదు.
ఈ డేటాను PostHog మా తరపున ప్రాసెస్ చేస్తుంది. వారి సర్వర్లు అమెరికాలో ఉండొచ్చు. వారి పాలసీ: posthog.com/privacy
కుకీలు, థీమ్
PostHog ఆ రాండమ్ IDని మీ బ్రౌజర్ కుకీలో పెడుతుంది, మళ్లీ వచ్చినప్పుడు ఒకే విజిటర్‌గా గుర్తించడానికి. లైట్/డార్క్ థీమ్ మీ బ్రౌజర్‌లోనే సేవ్ అవుతుంది — అది మా సర్వర్‌కి వెళ్లదు.
కుకీలను బ్రౌజర్ సెట్టింగ్స్‌లో ఆపేయొచ్చు. అలా చేస్తే అనలిటిక్స్ పూర్తిగా పనిచేయకపోవచ్చు. సైట్ చదవడానికి కుకీలు అవసరం లేదు.
మీరు మాకు పంపే మెయిల్
కాంటాక్ట్ ఫాం లేదా sukshmam.info@gmail.com కి మెయిల్ పంపితే, మీరు రాసినది మాకు వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే వాడుతాం.
ఇతర సైట్లు
కొన్ని ఆర్టికల్స్‌లో X (ట్విట్టర్) పోస్ట్‌లు ఉంటాయి. వాటిని లోడ్ చేస్తే X వారి కుకీలు పెట్టొచ్చు. అది మా నియంత్రణలో ఉండదు. మేము లింక్ చేసిన ఇతర సైట్ల పాలసీలు వాటివి.
మార్పులు, సంప్రదింపు
ప్రకటనలు మొదలుపెడితే లేదా డేటా వాడే విధానం మారితే, ఈ పేజీని అప్‌డేట్ చేస్తాం. తేదీ పైన కనిపిస్తుంది.
ప్రైవసీ గురించి ఏమైనా అడగాలంటే: sukshmam.info@gmail.com. సైట్ హైదరాబాద్, తెలంగాణ నుంచి నడుస్తుంది. సంబంధిత చట్టాలు భారతదేశం, తెలంగాణవి. మరిన్ని: నిబంధనలు, డిస్‌క్లైమర్.